Raviteja Next with 'Nenu Local' Director??


క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన మాస్ మహారాజా రవితేజ మొత్తానికి ఫామ్ లోకి వచ్చేశాడు. వరుస అపజయాల అనంతరం సక్సెస్ రావడంతో మాస్ రాజా ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాడు. ఇక నెక్స్ట్ ఖిలాడి సినిమాతో అదే రేంజ్ లో హిట్టు కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. రమేష్ వర్మ ఆ సినిమాకు దర్శకుడు.

ఇక ఖిలాడి సినిమాకంటే ముందే మరొక సినిమాను సెట్స్ పైకి తేవాలని రవితేజ కొత్త ప్లాన్ వేసినట్లు సమాచారం. నేను లోకల్ దర్శకుడు త్రినాథరావు నక్కిన మాస్ రాజాతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ వర్కౌట్ కావడం లేదు. ఇక ఫైనల్ గా ఇటీవల మాస్ రాజా దర్శకుడి స్క్రిప్ట్ పై పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఆ సినిమాను ఏప్రిల్ లో సెట్స్ పైకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు టాక్.



Post a Comment

Previous Post Next Post