No updates from Mahesh on May 31st?


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ డేట్ మిస్సయ్యినా కూడా మే 31ని మాత్రం అస్సలు మిస్సవ్వడు. ఆ రోజు కొత్త సినిమాలకు సంబంధించిన ఎదో ఒక ఎనౌన్స్మెంట్ రావాల్సిందే. తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్స్ ఇవ్వడం కామన్ గా వస్తున్నదే. ఇక ఈసారి కూడా సూపర్ స్టార్ అప్డేట్స్ రేడి అయినట్లు గత కొన్ని వారాలుగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

ఘట్టమనేని అభిమానులైతే ఒక్క పోస్టర్ వచ్చినా ట్రెండింగ్ తో రికార్డును క్రియేట్ చేయాలని రెడీగా ఉన్నారు. అయితే మహేష్ బాబు ఈసారి అప్డేట్స్ ఇచ్చే అవకాశం లేదని టాక్ వస్తోంది. ఎందుకంటే ఆ రోజే PRO బీఏ రాజు మరణించి కరెక్ట్ గా 9రోజులు అవుతుందని ఇలాంటి విషాద సమయంలో సినిమా అప్డేట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనే ఆలోచనలో ఉన్నారట. బీఏ రాజు కేవలం ఒక PRO మాత్రమే కాదు. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకు అలాగే మహేష్ బాబు కెరీర్ మొదలైనప్పటి నుంచి కూడా సినిమాల ప్రమోషన్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒక కుటుంబ సభ్యుడిలా ఘట్టమనేని వారితో క్లోజ్ అయ్యాడు. అందుక్స్ మహేష్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post