Gunashekar BIG risk with Samantha?


టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలే కాదు. హీరోయిన్స్ కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. సమంత అక్కినేని గుణశేఖర్ దర్శకత్వంలో చేస్తున్న శాకుంతలం సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో VFX చాలా కీలకమని బడ్జెట్ మళ్ళీ పెంచుతున్నట్లు సమాచారం.

గతంలో గుణశేఖర్ సినిమా అంటేనే భారీ సెట్స్ కనిపించేవి. కానీ ఇప్పుడు శాకుంతలం ప్రాజెక్ట్ కోసం విజువల్ ఎఫెక్ట్స్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే 35కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. ఇక ఇప్పుడు గ్రాఫిక్స్ వలన మరికొంత పెరగవచ్చని టాక్ వస్తోంది. గుణశేఖర్ హోమ్ ప్రొడక్షన్ తో పాటు దిల్ రాజు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే సమంతపై ఈ రేంజ్ లో బడ్జెట్ పెట్టడం అవసరమా అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. కానీ గుణశేఖర్ మాత్రం స్క్రిప్ట్ ను నమ్మి ముందుకు సాగుతున్నాడు. తప్పకుండా అనుకున్న మ్యాజిక్ క్రియేట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారట. మరి సినిమా ఏ స్థాయిలో వర్కౌట్ అవుతుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post