మళ్ళీ ఐదేళ్ల తరువాత బాలయ్యతో..?


నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకి తీసుకు రావాలని అనుకుంటున్నాడు గాని పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించడం లేదు. ఇక వినాయకచవితికి రావచ్చని సమాచారం. నెక్స్ట్ గోపిచంద్ మలినేనితో ఒక సినిమా అనుకుంటున్న విషయం తెలిసిందే.

అనిల్ రావిపూడితో కూడా సినిమా చేయాల్సి ఉంది. అలాగే మరో సీనియర్ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నిర్మాత సి.కళ్యాణ్ తో బాలయ్య ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమాకి శ్రీవాస్ దర్శకుడిని టాక్. ఐదేళ్ల క్రితం బాలయ్యతో డిక్టేటర్ సినిమా చేసిన శ్రీవాస్ ఆ తరువాత భారీ బడ్జెట్ తో సాక్ష్యం సినిమా చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అతనికి మళ్ళీ అవకాశాలు రాలేవు. ఇక ఇటీవల నిర్మాత సి.కళ్యాణ్ కు ఒక యాక్షన్ కథను చెప్పడంతో బాలయ్యకు ఫిక్స్ చేశారని సమాచారం. మరి ఆ కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.


Post a Comment

Previous Post Next Post