పూరి - విజయ్ 'లైగెర్' లో బిగ్ సర్‌ప్రైజ్‌?


విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రాబోతున్న మొదటి పాన్ ఇండియా మూవీ లైగర్ పై రోజురోజుకు అంచనాల డోస్ అకాశాన్ని దాటేస్తున్నాయి. సినిమాలో విజయ్ ఒక బాక్సర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ హాఫ్ లో నేషనల్ లెవెల్, సెకండ్ హాఫ్ లో ఇంటర్నేషనల్ లెవెల్ బాక్సర్ గా కనిపిస్తాడట.

ఇక సినిమాలో ఒక బిగ్ సర్‌ప్రైజ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా ఎంతోమంది బాక్సార్లకు ప్రేరణగా నిలిచిన అమెరికన్ ప్రొఫెషినల్ బాక్సర్ మైక్ టైజన్ కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఎలాగైనా సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని ఓ వైవు విజయ్ మరోవైపు పూరి గట్టిగానే కష్టపడుతున్నారు. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరితో కలిసి కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post