ఇప్పుడు విజయ్ సేతుపతి లాంటి యాక్టర్ దొరకాలి అంటే అంత ఈజీ కాదు. ఉప్పెన సినిమాకే తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది. సుకుమార్ చెప్పాడని స్టోరీ బావుందని ఒప్పుకోక తప్పుకోలేదు. ఆ సినిమా షూటింగ్ కూడా సేతుపతి డేట్స్ కు తగ్గట్లుగానే చేశారు. ఇక ఇప్పుడైతే అతను డేట్స్ చాలా గజిబిజిగా ఉన్నాయి. కరోనా వలన సినిమాలు వాయిదా పడడంతో మళ్ళీ కొత్త డేట్స్ ఇవ్వాలి అంటే చాలా కష్టమైన పని.
ప్రస్తుతం తమిళ లోనే అతను పూర్తి చేయాల్సిన సినిమాలు పది ఉన్నాయి. ఇక హిందీలో మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా మరికొన్ని సినిమాలు ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నాయి. మొత్తంగా 20 సినిమాలు పూర్తి చేయాల్సి ఉందట. కరోనా తగ్గితే ఇండియాలో అందరికంటె ఎక్కువగా విజయ్ బిజీ కానున్నాడు. కథలు నచ్చిన కూడా సేతుపతి ముందుగా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. డేట్స్ ఖాళీగా ఉంటేనే ఓకే చెబుతున్నాడట. వచ్చే ఏడాది కూడా కొత్త వారికి అతను అంత ఈజీగా దొరక్కపోవచ్చని తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment