అల.. వైకుంఠపురములో హిందీ రీమేక్.. టైటిల్ అర్ధమేంటో తెలుసా?


టాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది దాదాపు నాన్ బాహుబలి రికార్డులన్ని బ్రేక్ చేసిన అల.. వైకుంఠపురములో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఇప్పుడు హిందీలో రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. హిందీ రీమేక్ రైట్స్ కోసం చాలామంది ప్రయత్నం చేయగా నిర్మాత అల్లు అరవింద్ ఎవరికి ఇవ్వకుండా ఏక్తా కపూర్ తో సంయుక్తంగా నిర్మించేందుకు సిద్ధమయ్యారు. 

కార్తిక్ ఆర్యన్ - కృతి సనోన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు 'షెహజాదా' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. షెహజాదా అంటే ఉర్దూ భాషలో ప్రిన్స్ అని అర్థం. సినిమా కథ రొటీన్ అయినప్పటికీ తెలుగులో మ్యూజిక్ తో మాయ చేసి భారీ హైప్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ డ్యాన్స్, నటన సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. మరి హిందీలో అదే మ్యాజిక్ క్రియేట్ చేస్తారో లేదో చూడాలి. 


Post a Comment

Previous Post Next Post