పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా మాస్ ప్రేక్షకుల ఫోకస్ మాత్రం 28వ సినిమాపైనే ఉంది. ఎందుకంటే గబ్బర్ సింగ్ తరువాత మరోసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలో ఒక పవర్ఫుల్ సెంటిమెంట్ కొనసాగబోతున్నట్లు సమాచారం.
బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ vs ప్రకాష్ రాజ్ సీన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే వకీల్ సాబ్ లో కూడా హై వోల్టేజ్ సీన్స్ వెండితెరపై సరికొత్త కిక్కిచ్చాయి. ఇక హరీష్ శంకర్ సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇదివరకే సినిమా అంతకుమించి అనేలా ఉంటుందని హరీష్ శంకట్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కూడా చెప్పాడు. ఇక ప్రకాష్ రాజ్ తో మరోసారి పవర్ స్టార్ నటిస్తున్నారు అంటే సినిమా మరో లెవెల్లో ఉంటుందని చెప్పవచ్చు.
Follow @TBO_Updates
Post a Comment