కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ 46 ఏళ్ల వయసులో శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఈ నటుడు తన సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ ఉంటాడు. పునీత్ రాజ్‌కుమార్ ఇతర భాషలకు చెందిన పలువురు దక్షిణాది తారలకు కూడా సన్నిహితుడు. ఇక తమిళ నటుడు విశాల్ ఎనిమీ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పునీత్ రాజ్‌కుమార్‌తో తన స్నేహం గురించి వెల్లడించాడు.
పునీత్ రాజ్‌కుమార్ మంచి పనిని కొనసాగిస్తానని అన్నారు. “పునీత్ రాజ్‌కుమార్ చేపట్టిన 1800 మంది పిల్లల చదువు బాధ్యతను నేను తీసుకుంటాను. ఇక నుంచి అతని తరపున బాధ్యత నేను తీసుకుంటాను” అని విశాల్ చెప్పాడు. విశాల్ ఇప్పుడు ఎనిమీని ప్రమోట్ చేస్తున్నాడు. ఇది నవంబర్ 4 న తెలుగు మరియు తమిళ భాషలలో రిలీజ్ కానుంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశాల్, ఆర్య హీరోలుగా నటించారు. Follow @TBO_Updates
Post a Comment