భీమ్లా నాయక్ మాత్రమే ఎందుకు తప్పుకోవలంటే?


పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ జనవరి 12న చాలా గ్రాండ్ గా రిలీజ్ కానున్నట్లు ముందు నుంచి ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మిగతా సినిమాలు RRR, రాధేశ్యామ్, బంగార్రాజు సంక్రాంతికి వస్తున్న తరుణంలో పోటీ తీవ్రత చాలా ఎక్కువైంది. అయితే ఈ పోటీలో నుంచి పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే ఎందుకు తప్పుకోవాలి మిగతా హీరోల సినిమాలు ఎందుకు వాయిదా పడటం లేదు అనే సందేహం ప్రతీ ఒక్కరిలో ఉంది. 

ఇటీవల నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ చర్చలు జరిపి ఈ విషయంలో ఒక వివరణ ఇచ్చారు. నిజానికి రాధేశ్యామ్, RRR ఎప్పటి నుంచో విడుదల కావాల్సి ఉంది. ఈ సమయంలో భీమ్లా నాయక్ విడుదల కావడం అంత శ్రేయస్కరం కాదని
థియేటర్ల కేటాయింపు సమస్య అవుతుందట. దీంతో నిర్మాతల సంఘం జోక్యం చేసుకుని పవన్ కళ్యాణ్ భీమ్ల నాయక్ ను రేసు నుంచి తప్పుకోవాలని కోరింది. చివరికి తప్పని పరిస్థితుల్లో భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 కు పోస్ట్ పోను చేసుకుంది.

Post a Comment

Previous Post Next Post