అఖండ సీక్వెల్.. #BBB బాలయ్య బన్నీ బోయపాటి??


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో సీక్వెల్స్ అనేవి జోరుగా తెరపైకి వస్తున్నాయి. సక్సెస్ ఫార్ములాను స్టార్ డైరెక్టర్లు కరెక్ట్ గా ఉపయోగించుకుంటున్నారు. అఖండ సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుందని ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇక అందులో బన్నీ కూడా నటించే అవకాశం ఉందని బోయపాటి బాలయ్య బన్నీ అనేలా.. #BBB సెట్స్ పైకి  రానున్నట్లు తెలుస్తోంది.

బన్నీతో బోయపాటి ఇంకా ఫైనల్ చేయలేదు గాని.. ఏదైనా జరగవచ్చు అని ఒక హింట్ అయితే ఇచ్చేశాడు. ఇక అఖండ సినిమాకు సీక్వెల్ ఉంటుందని సినిమా ఎండింగ్ లోనే లీడ్ వదిలారు. సోదరుడి చిన్నారి కోసం అఖండ మళ్ళీ వస్తానని ఒక మాట ఇచ్చేశాడు. ఇక ఆమె మళ్ళీ మరో చిక్కుల్లో ఉండగా అఖండ అఘోరా మరో వెర్షన్ లో రంగంలోకి వస్తాడని తెలుస్తోంది. 

ఇక సీక్వెల్ లో విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఇంకా ఎక్కువగా ఉండేలా బోయపాటి క్షుద్ర పూజలతో అఖండను బందించే కాన్సెప్ట్ తో వస్తాడని తెలుస్తోంది. అయినప్పటికీ అఖండ ఎలా ఎదురించి నిలబడ్డాడు అనేది మేయిన్ స్టోరీ అని ఒక టాక్ వస్తోంది. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఆగాల్సిందే.


Post a Comment

Previous Post Next Post