కీర్తి ఖాతాలో మరో ప్లాప్?


మహానటి సినిమాతో కెరీర్ కు సరిపోయేంత క్రేజ్ అందుకున్న కీర్తి సురేష్ బాక్సాఫీస్ పరంగా కూడా మంచి మార్కెట్ అయితే క్రియేట్ చేసుకుంది. అయితే ఆ సినిమా తరువాత మళ్ళీ కీర్తికి సరైన సక్సెస్ రాలేదు. ఎలాంటి సినిమాలు చేసినా కూడా వరుసగా డిజాస్టర్స్ అవుతున్నాయి. ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలు దారుణమైన ఫలితాలను అందుకుంటున్నాయి.

పెంగ్విన్ సినిమా తరువాత మిస్ ఇండియా కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత నితిన్ తో చేసిన రంగ్ దే సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఇక ఇప్పుడు వచ్చిన గుడ్ లక్ సఖి సినిమా కూడా ప్లాప్ టాక్ అందుకునేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. మొదటి షోకే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చేసింది. ఆమె స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే బెటర్ అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం అమ్మడి చేతిలో మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ఉంది. అలాగే తమిళ సినిమాలతో పాటు మెగాస్టార్ బోళా శంకర్ లో సిస్టర్ పాత్రలో నటిస్తోంది. మరి ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post