రాజా డీలక్స్.. ప్రభాస్ కు ఇష్టం లేదట!


రాధే శ్యామ్, సలార్, ఆదిపురష్, ప్రాజెక్టు K ఇలా వరుస పాన్-ఇండియా సినిమాలను లైన్ లో పెట్టిన ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా క్రేజ్ అందుకుంటున్నాడు. కామెడీ దర్శకుడు మారుతితో కూడా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఆ సినిమా టైటిల్ 'రాజా డీలక్స్' అని చర్చించుకుంటున్నారు. 

అయితే ప్రభాస్ ఆ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. రెండే రెండు షెడ్యూల్స్ లో షూట్ మొత్తం ఫినిష్ అవ్వాలని అనుకుంటున్నారు. అయితే టైటిల్ విషయంలో ఆడియెన్స్ అంతగా హ్యాపీగా లేరని ప్రభాస్ ప్రత్యేకంగా మారుతికి చెప్పినట్లు సమాచారం. ప్రభాస్ రేంజ్ కు కూడా ఆ టైటిల్ సరితూగడం లేదని చెప్పడంతో ఆ టైటిల్ ను మార్చేందుకు డిసైడ్ అయినట్లు టాక్. మరి ఇంకా ఎం టైటిల్ సెట్ చేస్తారో చూడాలి. డివివి.దానయ్య నిర్మించబోయే ఈ సినిమాను హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది.

Post a Comment

Previous Post Next Post