Radhe Shyam @ Review


కథ:
1970ల కాలంలో కొనసాగే ఈ కథలో విక్రమాదిత్య (ప్రభాస్) ప్రపంచంలోనే ప్రఖ్యాత పామిస్ట్ గా గుర్తింపు అందుకుంటారు. పరిస్థితుల కారణంగా ఇటలీకి పారిపోయిన విక్రమ్ ఆదిత్య ఒక రైలు ప్రయాణంలో ఇటలీలో ప్రేరణ (పూజ)ని కలుస్తాడు. ఇక మొదటి చూపులోనే వారు ప్రేమలో పడతాడు. మరోవైపు ప్రేరనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుండగా విక్రమాదిత్య  విధి పరీక్షను ఎలా ఎదుర్కొంటాడు అనేది సినిమా ప్రాథమిక కథాంశం.

విశ్లేషణ:
మొదటి సినిమా జిల్ తో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ రెండవ అవకాశంలోనే చాలా పెద్ద ఛాలెంజ్ తీసుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఒక ప్రేమ కథలో ఇప్పుడున్న ఇమేజ్ తో చూపించడం అంటే చాలా కష్టమైన పని. బాహుబలి సాహో వంటి యాక్షన్ సినిమాల అనంతరం ప్రభాస్ తో ఒక్క ఫైట్ లేకుండా ప్రజెంట్ చేశారు. కథాంశం లోకి వెళితే.. మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయి.. అని బలంగా డెస్టినితో ముందుగా సాగే విక్రమాదిత్య హఠాత్తుగా ప్రేమలో పడడం.. ఆ తరువాత విధి ఆడిన నాటకంలో వారి ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది.. డెస్టినీని బలంగా నమ్మే ఒక పామిస్ట్ ప్రేమలో చివరికి దేన్ని నమ్మకుండా ఆ ప్రేమ కోసం తాపత్రయ పడడంతో కథ ముందుకు సాగుతుంది. 

దర్శకుడు రాధాకృష్ణ ఎంచుకున్న స్టోరి ప్లాట్ అయితే చాలా కొత్తగా ఉంది. కానీ స్క్రీన్ ప్లే మాత్రం సినిమాకు పెద్ద మైనెస్. సినిమాలో మేయిన్ లీడ్ మధ్యలో కెమిస్ట్రీ మాత్రం అంతగా వర్కౌట్ అవ్వలేదు. ప్రేరణ, విక్రమాదిత్య మధ్యలో వచ్చే సరదా సన్నివేశాలు ఏమంత కనెక్ట్ అయ్యే విధంగా లేదు. మిగతా కామెడీ సన్నివేశాలు కూడా బారంగానే ఉన్నాయి. కానీ విజువల్స్ మాత్రం సినిమాలో అద్భుతంగా ఉన్నాయి. ఒక విధంగా కథలో అవసరమైన సన్నివేశాల కోసం కావాల్సినంత గ్రాండియర్ ను తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. 

ఇక అసలైన లీడ్ పెయిర్‌లో అసాధారణమైన కెమిస్ట్రీ ఉండాలి. మొదటి సన్నివేశం నుండి స్పార్క్స్ బలంగా ఉండాలి. అసలు ఎమోషనల్ కంటెంట్ హిట్ అయినప్పుడు అది హృదయాలను తాకాలి. కానీ రాధే శ్యామ్‌తో అలాంటిదేమీ జరగదు. దర్శకుడు ఒక పుస్తకం  ద్వారా ప్రతిదీ స్పష్టంగా హైలెట్ చేసినప్పటికీ ఎక్కడో ఎదో మిస్ అవుతున్న ఫీల్ కలుగుతుంది.

ఫస్ట్ హాఫ్ మొత్తం లీడ్ క్యారెక్టర్స్ మధ్య సరదా సన్నివేశాలతో కొనసాగడం. వారి వ్యక్తిగత పరిచయాలతో మొదలవుతుంది. పూజ హెగ్డే క్యారెక్టర్ చూడడం కాస్త బారంగానే అనిపిస్తుంది. ఆమెది సాధారణ కమర్షియల్ ఎంటర్‌టైనర్ నుండి తెచ్చిన పాత్రలా కనిపిస్తుంది. ఇక ప్రభాస్ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ రోజులను గుర్తు చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ప్రేమ వర్సెస్ విధికి సంబంధించిన అసలు కథ ఇంటర్వెల్ మార్క్ నుండి ప్రారంభమవుతుంది.  ఇది సెకండ్ హాఫ్‌పై అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ నోట్ తో మొదలవుతుంది. కానీ దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. హీరోకి సంబందించిన ఒక సమస్య ఆసక్తిని రేకెత్తిస్తుంది. కథలో అది అది ఒక సంఘర్షణకు దారి తీస్తుంది. ఆ ఎపిసోడ్స్ కొన్ని సెకండ్ హాఫ్ లో అంతగా వర్కవుట్ అవ్వలేదు.

ఇక ప్రీ-క్లైమాక్స్‌లో ఓడతో కూడిన సునామీ సీక్వెన్స్ పై ప్రమోషన్ లో కాస్త ఎక్కువగా హైలెట్ చేశారు. ఇక అందులో కొన్ని షాట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఆ సన్నివేశాలలో విజువల్‌గా ప్రేమ వర్సెస్ డెస్టినీ క్లాష్‌ని సెట్ చేస్తుంది. కానీ అక్కడ కూడా ఎమోషన్ అంతగా కనెక్ట్ అవ్వదు. చివరలో కొన్ని మంచి డైలాగ్‌లు ఉన్నాయి, కానీ అప్పటికే సినిమా బోరింగ్ గా అనిపిస్తుంది. అలాగే హీరోయిన్ కు సంబంధించిన ట్రాక్ మరింత నిరాశకు గురి చేస్తుంది. ఇక మ్యూజిక్ సినిమాలో పరవాలేదు. థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ బాగానే ఉన్నా సీన్స్ అంతగా కనెక్ట్ అవ్వనప్పుడు ఏమంత ఫీల్ రాదు. 

ప్లస్ పాయింట్స్
👉ప్రభాస్
👉పామిస్ట్ కథాంశం
👉విజువల్స్ ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్
👉లీడ్ పెయిర్ మధ్యలో కెమిస్ట్రీ మిస్సింగ్
👉చిరాకు తెప్పించే సన్నివేశాలు
👉హీరోయిన్ రోల్
👉నెమ్మదిగా సాగే కీలకమైన ఎపిసోడ్స్

ఫైనల్ గా.. రాధే శ్యామ్ ఇప్పుడున్న ప్రభాస్ ఇమేజ్ కు అయితే ఏమంత సెట్ అవ్వలేదు. ఎలాంటి అంచనాకు లేకుండా ప్రభాస్ పామిస్ క్యారెక్టర్, పలు విజువల్స్ కోసం సినిమాను ఒకసారి చూడవచ్చు.

రేటింగ్: 2.50/5

Post a Comment

Previous Post Next Post