సర్కారు వారి పాట సెకండ్ హాఫ్ లో హీరోయిన్ పై హీరో కాలు వేసే సీన్స్ పై ఏ స్థాయిలో విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా వరకు మహేష్ అభిమానులే ఆ సీన్ ను మెచ్చుకోలేదు. వల్గారిటీ ఎక్కువయ్యిందని అన్నారు. ఇక దర్శకుడు పరశురామ్ సీన్ పై వచ్చిన అభిప్రాయంపై ఎవరు ఊహించని విధంగా స్పందించాడు.
ఆ సీన్స్ లో ఎక్కడా వల్గారిటీ లేదు అంటూ.. వల్గారిటీ వుంటే మహేష్ గారే వద్దని చెప్పేవారని.. ఒక తల్లి దగ్గర నిద్రపోయే ఒక బిడ్డలా ఆ సీన్స్ ఉంటాయి తప్పితే అందులో వల్గారిటీ లేదు అని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలే విమర్శలు ఎక్కువవుతున్న తరుణంలో ఇంకా ఆ సన్నివేశాన్ని తల్లితో సమానంగా అని చెప్పడం మరింత దారుణంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
Follow @TBO_Updates
Post a Comment