ఇలాగైతే అలాంటి సినిమాలకు బొక్కేగా?


50 రోజుల తరువాత గాని సినిమాలు ఇక నుంచి ఓటీటీ విడుదల అవ్వకుండా థియేట్రికల్ బిజినెస్ ను కాపాడాలని చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ మోర పెట్టుకుంటున్నారు. ఇక నిర్మాతలు కూడా అదే తరహాలో ముందుకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. ఓటీటీ బిజినెస్ వల్ల జనాలు థియేటర్స్ ను బాగా దూరం పెట్టేస్తున్నారని చెప్పవచ్చు. సినిమా ఎంతో బాగుంటే గాని థియేటర్స్ కు రావడం లేదు.

50 రోజుల తరువాత ఓటీటీ రిలీజ్ అనేది ఎంతవరకు మేలు అనేది కాస్త సందేహించాల్సిన విషయం. కొన్ని సినిమాకు బొక్కబోర్లా పడ్డట్లే అని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే దారుణంగా బొక్కబోర్లా పడుతున్నాయి. దీంతో ఓటీటీ సంస్థలు అడ్వాన్స్ గా ఓటీటీలో విడుదల చేసేందుకు మంచి పేమెంట్స్ ఇచ్చి కొంత కాస్త నష్టాలను తగ్గిస్తున్నాయి. 

ఇక ఇప్పుడు 50 రోజుకు కండిషన్ పెడితే  బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాలకు వచ్చే కాస్త డబ్బులు కూడా పోయినట్లే లెక్క. అయినా హిట్ సినిమాకే వీకెండ్ అనంతరం కలెక్షన్స్ బాగా తగ్గుతున్నాయి. ఇక అంత ఆలస్యం అయితే రొటీన్ ప్రైజ్ లకే ఓటీటీ సంస్థలు ముందు లాక్ చేసుకున్న డీల్స్ ప్రకారం విడుదల చేసుకుంటాయి. మరి ఈ నియమాలు ఎప్పటి వరకు కొనసాగుతాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post