శ్రీవారి కోసం మరో 25కోట్లు ఖర్చు చేస్తున్న నయన్


నయనతార ఇటీవల దర్శకుడు విగ్నేష్ శివన్ ను హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి పెళ్లి అనంతరం కొత్త ఇంట్లోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇక ఆ కొత్త బంగ్లా కోసం పూర్తి స్థాయిలో నయనతార సొంత ఖర్చులతో నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. పోయెస్ గార్డెన్ లో ఇదివరకే 8000 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసిన ఆమె ప్రత్యేకంగా బంగ్లాను నిర్మిస్తున్నట్లు సమాచారం.

ఇక అందులో కేవలం ఇంటీరియర్ కోసమే కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తంగా 25 కోట్ల వరకు ఆమె తన స్వీట్ హోమ్ కోసం బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నట్లు టాక్. అలాగే ఆ ఇంటి హక్కులు కూడా భర్త పేరు మీద ఉండే విధంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించిందట. పెళ్లి తర్వాత తన భర్తకు గుర్తుండిపోయే విధంగా నయనతార ఈ ఖరీదైన కానుక ఇచ్చినట్లుగా తెలుస్తోంది  ఇక ఆస్తి పరంగా అయితే విగ్నేష్ కు కనీసం 20 కోట్ల రూపాయల కూడా లేవు. కానీ నయన్ కు మాత్రం దాదాపు 150 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post