టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు వచ్చిన సినిమాల కంటే ఈసారి విభిన్నంగా తెరకెక్కిన లవ్ స్టోరీ సమ్మతమే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన సమ్మతమే ఫస్ట్ వీకెండ్ లోనే 3 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేసింది, 4వ రోజు నుంచే ప్రొడ్యూసర్ & డిస్ట్రిబ్యూటరలు ప్రాఫిట్స్ జోన్ లోకి వచ్చేశారు.
అయితే మొదటి వారంతారం కూడా సినిమాకు జనాల నుంచి మంచి స్పందన లభిస్తూ ఉండడం విశేషం. ఇ వీక్ వచ్చిన కొత్త సినిమాలకు టాక్ అంతగా లేకపోవడంతో ఇప్పుడు జనాల దృష్టి మళ్లీ సమ్మతమే వైపు మళ్లింది. యూత్ అండ్ ఫ్యామిలీ కి కనెక్ట్ అవ్వడంతో సినిమా కలెక్షన్స్ స్టెఢీ గా వస్తున్నాయి. కొత్త సినిమాలకు పెద్దగా టాక్ లేకపోవడం తో ఈ వీకెండ్ కి 'Sammathame' మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. చూస్తుంటే కిరణ్ అబ్బవరం మరోసారి బాక్సాఫీస్ వద్ద మరిన్ని లాభాలను అందించేలా ఉన్నాడు అనిపిస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment