దిల్ రాజు అతిపెద్ద బిజినెస్.. @శంషాబాద్?


ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరొక కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సినిమా ప్రపంచంలో భారీ స్థాయిలో బాక్సాఫీస్ హిట్స్ సొంతం చేసుకున్న దిల్ రాజు ఇప్పుడు హైదరాబాద్ చివరలో కోట్లల్లో ఖర్చు పెట్టి ఒక ఫిలిం స్టూడియో నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాదులో కొన్ని ఫిలిమ్ స్టూడియోలకు భారీ స్థాయిలో ఆదాయం లభిస్తున్న విషయం తెలిసిందే. 

ఇక దిల్ రాజు కూడా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు అలాగే ఇతర ఇండస్ట్రీ ప్రముఖులతో కూడా మంచి పరిచయాలు ఉండడంతో అన్ని విధాలుగా ఆలోచించి సొంతంగా స్టూడియో పెట్టుకుంటే అందులోనే అన్ని సినిమాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోవచ్చు అని ఫిక్స్ అయ్యారట. ఈ తరహాలో చేస్తే సొంతంగా నిర్మించే సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చాలావరకు డబ్బులు మిగులుతాయట. 

అంతేకాకుండా ఇతర సినిమాకు సంబంధించిన పనులు  కూడా కొనసాగుతుతాయు కాబట్టి మంచి ఆదాయంలో వస్తుంది అని అందుకే దిల్ రాజు భారీ పెట్టుబడితో శంషాబాద్ చివరలో ఒక ల్యాండ్ తీసుకుని అక్కడే స్టూడియో నిర్మిస్తున్నారట. అందులో లేటెస్ట్ గా  సాంకేతికంగా కావాల్సిన అన్ని పరికరాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయ్ వారసుడుకు సంబంధించిన పనులు కూడా అక్కడ మొదలుపెట్టినట్లు సమాచారం. త్వరలోనే దిల్ రాజు అఫీషియల్ గా ఆ స్టూడియో మొదలుపెడతారని తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post