నరేష్ బ్యాక్ గ్రౌండ్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఒకప్పటి హీరోయిన్ విజయ నిర్మల కొడుకుగా హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తరువాత మంచి నటుడిగా స్థిరపడ్డారు. ఇక నరేష్ కు మూడుసార్లు పెళ్లి అయినట్లు విడాకులైనట్లు చాలామంది జనాలకు ఇటీవల పవిత్ర లోకేష్ వివాదంతోనే తెలిసింది. ఇక అతని వెంట పవిత్ర తిరుగుతోంది ఆస్తి కోసమే అని ఆమె మాజీ భర్తతో పాటు మరి కొంతమంది కామెంట్స్ చేశారు.
అయితే నరేష్ ఆస్తి విలువ ఎంత ఉండవచ్చు అని ఆరా తీస్తే ఆ లెక్కలు వందల కోట్లల్లోనే ఉంటుందని తెలుస్తోంది. విజయ్ నిర్మల అప్పట్లోనే చెన్నైలో వందల ఎకరాల భూములు బంగ్లాలు కొనుగోలు చేశారు. ఇక ఆమె నుంచే దాదాపు 300కోట్ల వరకు వచ్చి ఉంటుందని అంచనా. ఇక హైదరాబాద్ సమీపంలో నరేష్ కు సొంతంగా ఫామ్ హౌజ్ లు కూడా ఉన్నాయట. ఇక అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రోజుకు లక్షల రెమ్యునరేషన్ తో మొత్తంగా ఒక సినిమాకి 20 లక్షల నుంచి 40 లక్షల వరకు అందుకుంటున్నాడు కూడా. ఇలా చూసుకుంటే నరేష్ ఆస్తి దాదాపు ఒక స్టార్ హీరోకు ఉన్నంతగా 350 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం.
Follow
Post a Comment