మలయాళం ప్రేమమ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా కాలం అయినప్పటికీ ఈ బ్యూటీ ఇంకా తన రేంజ్ ను పెంచుకునే విధంగా స్టార్ హీరోలతో అవకాశాలు అయితే అందుకోలేదు. ఇక మొత్తానికి అనుపమ తన కెరీర్‌లో మొదటి పెద్ద హీరో చిత్రంలో ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే మాస్ రాజా రవితేజతో రొమాన్స్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. మాస్ రాజ్ వయసు 54 అయినా ఇంకా ఎనర్జిటిక్ గా కనిపిస్తుంటారు. ఇక ఇంతకుముందు “సూర్య వర్సెస్ సూర్య” సినిమాతో దర్శకుడిగా ప్లాప్ అందుకున్న కార్తికేయ సినిమా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని, ఇప్పుడు స్క్రిప్ట్‌తో మాస్‌రాజాని ఆకట్టుకున్నాడని అంటున్నారు. డిస్కో రాజా, ధమాకా సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేసిన తరువాత రవితేజతో సాన్నిహిత్యం పెంచుకున్న కార్తిక్ మొత్తానికి అనుపమ్ ని ఫిక్స్ చేసి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు. మరి ఆ సినిమా అనుపమకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.
Follow
Post a Comment