స్టార్స్ కాంబినేషన్స్.. క్యాన్సిల్.. క్యాన్సిల్!

 


టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో నెవర్ బిఫోర్ అనేలా బిగ్గెస్ట్ కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి. అయితే అందులో మొదట అనుకున్న ప్రాజెక్టులు షూటింగ్ దశలోకి వచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ అవుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పవన్ హరీష్ శంకర్ మొదట అనుకున్న భవదియుడు భగత్ సింగ్ కథను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు మరొక దాని కోసం చర్చలు మొదలుపెట్టారు.


ఇక రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ అంతా రెడీ అయిన తరుణంలో చివరికి అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు మొదట ఎన్టీఆర్ తో చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎంతో కాలాన్ని కూడా వృధా చేసుకున్నాడు. కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు రాంచరణ్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. మహేష్ బాబు 28వ ప్రాజెక్ట్ విషయంలో చాలా కఠినంగా ఉంటున్నాడు అనిపిస్తోంది. వీళ్లు కూడా మొదట అనుకున్న కథను క్యాన్సిల్ చేసుకుని మరో కొత్త కథను సెట్స్ పైకి తీసుకువస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post