పవన్ - రవితేజ.. ఇది అసలు మ్యాటర్!


మాస్ మహారాజ రవితేజ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అని చాలా కాలంగా అనేక రకాల గాసిప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి. అది కూడా తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న విక్రమ్ వేద సినిమాకు రీమేక్ అని కూడా కథనాలు వెలువడుతున్నాయి. అయితే అదే కథను బాలీవుడ్ లో రీమేక్ చేయగా డిజాస్టర్ గా నిలిచింది.

ఇటీవల కాలంలో రీమేక్ సినిమాలు అంటేనే ఆడియోన్స్ అంతగా ఆసక్తిని చూపించడం లేదు. ఇక ఇప్పుడు రవితేజ పవన్ తో అలాంటి రీమేక్ చేస్తున్నారు అనగానే చాలా రకాల నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. అయితే నిజానికి ఇది మొదట చర్చల్లోకి వచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం ఎవరు చేయాలని అనుకోవడం లేదని తెలుస్తోంది. 

కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ చేస్తున్న ప్రాజెక్టు అదే రీమేక్ అని మొదట టాక్ వచ్చింది కానీ అందులో కూడా నిజం లేదు అని దర్శకుడి నుంచి క్లారిటీ వచ్చేసింది. ఇక సురేందర్ రెడ్డి ఆ రీమేక్ చేయవచ్చు అని కూడా ఇండస్ట్రీలో కూడా టాక్ వచ్చింది. కానీ సురేందర్ రెడ్డి ప్రస్తుతం సొంత కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇక విక్రమ్ వేద తెలుగులో రాకపోవచ్చు.

Post a Comment

Previous Post Next Post