ఇండియన్-2.. అసలు ఏమాత్రం సౌండ్ లేదు సారు!

కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్-2’ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఎలా తెరకెక్కించాడో కానీ మినిమమ్ బజ్ కూడా క్రియేట్ కావడం లేదు. 28 ఏళ్ల తర్వాత ఈ కాంబో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. ఇక షూటింగ్ చాలా కాలం క్రితం ప్రారంభమై, ఇటీవల పూర్తయింది. జూన్ 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్ ఇటీవల విడుదలైంది. 


అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మొదటి భాగం ‘ఇండియన్’కు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇప్పటికి విన్నా కొత్తగా ఉంటాయి. కానీ ‘ఇండియన్-2’ పాటలు మాత్రం మిక్స్‌డ్ రివ్యూస్ అందుకున్నాయి. అనిరుధ్ మ్యూజిక్ ఎమాత్రం బజ్ క్రియేట్ చేయడం లేదు. ఓ రెండు సాంగ్స్ డీసెంట్‌గా ఉన్నప్పటికీ, మిగతా పాటలు మాత్రం ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కొంతమంది అనిరుధ్, రెహమాన్ కంపోజిషన్‌లతో పోల్చి విమర్శిస్తున్నారు. రెహమాన్ రేంజ్ లో అనిరుధ్ న్యాయం చేయలేదని అంటున్నారు. ఇక రాబోయే అప్డేట్స్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post