జాతి రత్నాలు అనుదీప్.. మళ్ళీ ఇంకో హీరోనా..


'జాతి రత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీకి మంచి గుర్తింపు తెచ్చింది. ఆ సినిమా తర్వాత శివ కార్తికేయన్ తో 'ప్రిన్స్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అనంతరం అనుదీప్ రవి తేజతో సినిమా చేయాలని అనుకున్నారు కానీ, ఆ ప్రాజెక్ట్ స్థిరపడలేదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు.


తర్వాత అనుదీప్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో చర్చలు జరిపారు, వెంకటేష్ తో చేయనున్నట్లు టాక్ వచ్చింది. అలాగే నవీన్ పొలిశెట్టి తో కూడా ఒక సినిమా అనుకున్నారు. కానీ, ఏ ప్రాజెక్ట్ కూడా ముందుకు కదల్లేదు. ఇక తాజా సమాచారం ప్రకారం, అనుదీప్ విశ్వక్ సేన్ ని తన కథతో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట మరియు గోపి ఆచంట నిర్మించనున్నారని టాక్.

అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది మరియు వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అనుదీప్, మెగాస్టార్ చిరంజీవి తో కూడా సినిమా చేయడానికి చర్చలు జరిపారు కానీ, ఆ ప్రాజెక్ట్ పై ఎలాంటి లీక్స్ బయటకు రావడం లేదు. ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసారు మరియు 'లైలా' సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. అతనికి ఇంకా రెండు ప్రాజెక్ట్స్ లైనప్‌లో ఉన్నాయి. 

Post a Comment

Previous Post Next Post