ఎన్టీఆర్ - హాయ్ నాన్న డైరెక్టర్.. ఇంత బిజీలో అయ్యే పనేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో తన క్రేజ్ ను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "దేవర" మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉండగా, ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ తరువాత, ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి "వార్ 2" లో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.


ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న "డ్రాగన్" మూవీ కూడా ఎన్టీఆర్ కు మరో భారీ ప్రాజెక్ట్ గా నిలవనుంది. ఈ చిత్రం ఆగష్టు లేదా సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రష్మిక మందన ఇందులో హీరోయిన్ గా నటించనున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ విధంగా వరుసగా మూడు భారీ ప్రాజెక్ట్స్ లో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు.

ఇంతకుముందు ప్రముఖ హీరో నాని నటించిన "హాయ్ నాన్న" సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శౌర్యువ్, ఎన్టీఆర్ కోసం ఒక కథను తయారుచేశారు. ఈ కథను ఎన్టీఆర్ కి వినిపించడంతో, తారక్ ఆ కథ నచ్చి, ఒకే చెప్పాడని సమాచారం. వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే, ఎన్టీఆర్ ప్రస్తుతం తన లైన్ అప్ ప్రకారం, మరో మూడేళ్ళ పాటు ఇతర దర్శకులతో ప్రాజెక్ట్స్ చేయలేనిది కనపడుతోంది.

అయితే, శౌర్యువ్ తో సినిమా చేయాలనే నిర్ణయం ఎన్టీఆర్ తీసుకుంటే, అది యంగ్ డైరెక్టర్ కి పెద్ద బ్రేక్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, ఎన్టీఆర్ యంగ్ డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. శౌర్యువ్ దర్శకత్వంలో సినిమా చేస్తే, అది అతని కెరీర్ లో మైలురాయిగా నిలవనుంది.

Post a Comment

Previous Post Next Post