Trending: కుర్ర హీరో ప్రేమ, ఎఫైర్ గొడవ.. ఎక్కడో తేడా కొడుతోందే?



ప్రస్తుతం మీడియాలో కుర్ర హీరోకు సంబంధించిన ప్రేమ వ్యవహారం, హీరోయిన్ ఎఫైర్ వివాదం బాగానే వైరల్ అవుతోంది. తనను పెళ్లి చేసుకొని ఇప్పుడు మరో హీరోయిన్ తో ఎఫైర్ లో ఉన్నాడు అని, సదరు హీరోయిన్ ను అతన్ని ట్రాప్ చేసినట్లు ప్రేయసి మీడియా ముందుకు వచ్చి చెబుతోంది. అంతా బాగానే ఉంది కానీ, పదేళ్ళ కంటే ఎక్కువ కాలం రిలేషన్ లో ఉన్న ఆ అమ్మాయి ఇంత సడన్ గా ఇప్పుడు ఎందుకు ఈ వ్యవహారం బయటకు తీసుకు వచ్చింది అనేదే అసలు ప్రశ్న.


ఆ హీరోకు సంబంధించిన ఒక సినిమా ట్రైలర్ కూడా ఈమధ్య విడుదలైంది. అసలు ఏమాత్రం బజ్ లేదు. త్వరలోనే సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇక ఈ క్రమంలో సడన్ గా ప్రేయసి మీడియా ముందుకు రావడం పోలీసులకు పిర్యాదు చేయడం వంటి అంశాలు హాట్ టాపిక్ అయ్యాయి. హాట్ టాపిక్ అయ్యాయి అనే కంటే అలా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పవచ్చు. ఈ వ్యవహారంలో ఎంతవరకు నిజం ఉందొ కానీ అసలే కుర్ర హీరోకి సక్సెస్ లేక మార్కెట్ సంపాదించుకోవడం కష్టమయ్యింది.

కొత్త సినిమాకు బయ్యర్లు కరువయ్యారు. ఇక ప్రమోషన్స్ చేసుకోవాల్సిన టైమ్ లోనే అదే సినిమా హీరోయిన్ తో ఎఫైర్ అనడం, ప్రేయసి వచ్చి మోసం చేస్తున్నారని చెప్పడం అంతా టైమింగ్ కు జరిగిపోతున్నాయి. మ్యాటర్ ఏమిటంటే కొన్ని మీడియా ఛానెల్స్, వెబ్ సైట్స్ ఈ వ్యవహారం పై పని గట్టుకుని మరి డప్పు వాయిస్తున్నాయి. ఇక హీరో హీరోయిన్ పేర్లతో ఆ సినిమా టైటిల్ కూడా హైలెట్ చేస్తున్నారు.

వాళ్ళ హడావుడి చూస్తుంటే భాదితులే ఇంకా ఎక్కువ హైలెట్ చేయండి అన్నట్లు ఉంది. ఇలాంటి వ్యవహారంపై కూర్చొని మాట్లాడుకోవాలి లేదంటే మాకు కాస్త ప్రైవసీ అవసరం అంటే అది హుందాతనం. కానీ మా గొడవను ఇంకా హైలెట్ చేయండి అన్నట్లు అప్డేట్స్ ఇస్తున్నట్లు ఉంది. గొడవ సర్దుమనగకుండా అప్పుడప్పుడు స్పెషల్ అప్డేట్స్ ఇస్తున్నట్లు ఉంది. ఇది నాలుగు గోడల మధ్య తేల్చుకోవాల్సిన విషయం అని వారికి తెలియంది కాదు. గొడవ తృటిలో బయటకు వచ్చింది అంటే తప్పులేదు కానీ, కేవలం సినిమాకు బజ్ లేదని ఏదో ఒక రకమైన సింపథీ డ్రామా క్రియేట్ చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది.

Post a Comment

Previous Post Next Post