బాక్సాఫీస్ క్లాష్.. చిరు vs బాలయ్య vs విజయ్?

 


ఏడాది పొడవునా ఎన్ని సీజన్లు వచ్చినా సంక్రాంతి బరిలో తలపడే స్టార్ హీరోల క్లాష్‌కి ఓ ప్రత్యేక రేంజ్ ఉంటుంది. 2026 సంక్రాంతికి కూడా అలాంటి క్లాష్ జరగబోతోందన్న సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబో సినిమా విడుదల ఖరారు కాగా, విజయ్ ‘జన నాయగన్’ కూడా అదే టైమ్‌కి బరిలోకి దిగుతోంది. తాజాగా బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ 2 తాండవం సినిమా కూడా సంక్రాంతికి రావాలని భావిస్తోందట.


సెప్టెంబర్ 25 దసరా రిలీజ్ అనౌన్స్ చేసినప్పటికీ షూటింగ్ ఇంకా ఎక్కువ భాగం మిగిలి ఉండటం, గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం అవసరమవడంతో టైమ్ సరిపోదని భావిస్తున్నారట. ఇదే నిజమైతే బాలయ్య ఫ్యాన్స్‌కి ఇది డబుల్ ధమాకా. ఎందుకంటే సంక్రాంతి అంటే బాలయ్య సినిమాలకు కలిసొచ్చే సీజన్. ఫ్లాష్ బ్యాక్ చూస్తే 2023లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక మళ్లీ చిరు, బాలయ్య, విజయ్ ముగ్గురూ ఒకేసారి సంక్రాంతి బరిలోకి దిగితే... బయ్యర్లు, థియేటర్ల వార్, ఫ్యాన్స్ ఫెస్టివల్ అన్నీ పునరావృతం కావడం ఖాయం.

Post a Comment

Previous Post Next Post