క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఎలాంటి సినిమా చేసినా కూడా అంచనాలు అమాంతంగా పెరిగిపోతుంటాయి. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ అనంతరం ఆయన నుంచి వస్తున్నా బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఒక వైపు పెద్ద సినిమాలు చేస్తూనే తన శిష్యులను కూడా డైరెక్షన్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా సుకుమార్ రైటింగ్స్ ను స్థాపించి శిష్యులను చాలా పవర్ఫుల్ గా రెడీ చేస్తున్నాడు.
మొదట కుమారి 21 F ద్వారా సూర్య ప్రతాప్ ను దర్శకుడిగా పరిచయం చేయించిన సుక్కు ఆ తరువాత హరిప్రసాద్ (దర్శకుడు) హుస్సేన్ షా కిరణ్ (మీకు మీరే మాకు మేమే) లను డిఫరెంట్ సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఇటీవల ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడంతో మరో నలుగురు కూడా త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ రైటింగ్స్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ ను కూడా పాట్నర్స్ గా చేసుకొని తన శిష్యులకు అవకాశం ఇస్తున్నాడట. మరి రాబోయే శిష్యులతో సుకుమార్ ఇంకా ఎలాంటి హిట్స్ అందుకుంటాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment