ఫామ్ లో లేని దర్శకుడితో రామ్ 80కోట్ల ప్రయోగం?


ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్ ను 40కోట్లు దాటించేసినా రామ్ పోతినేని రెడ్ సినిమాతో మాత్రం ఆ రేంజ్ లో లాభాలను అందుకోలేదు. ఆ సినిమా కేవలం 5కోట్ల ప్రాఫిట్స్ ను మాత్రమే అందించింది. ఇక నెక్స్ట్ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేశాడు రామ్. తన 19వ సినిమాను లింగుస్వామి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.

మొదటిసారి ద్విభాషా చిత్రంగా చేస్తున్న ఈ సినిమాపై రామ్ పెట్టుకున్న నమ్మకం అంతా ఇంతా కాదు. ఏకాంగా 80కోట్ల భక్తి బడ్జెట్ తో సినిమాను సిద్ధం చేయనున్నారట. డైరెక్టర్ లింగుస్వామి గత సినిమాలు అనుకున్నంత రేంజ్ లో అయితే హిట్టవ్వలేదు. చివరగా ఆయన చేసిన పందెం కోడి 2 బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. అయితే రామ్ లింగుస్వామితో చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాడో గాని బడ్జెట్ మాత్రం మార్కెట్ కు మించి పెడుతున్నారు. మరి సినిమా ప్రేక్షకుక ముందుకు వచ్చాక ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.Post a Comment

Previous Post Next Post