చిన్నారి పెళ్లి కూతురు అప్పుడే బిజినెస్ లోకి వచ్చేసింది కదా!!


చిన్నారి పెళ్లి కూతురు అనే డబ్బింగ్ సీరియల్ ద్వారా తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైన అవికా గోర్ అనంతరం చాలా ఏళ్లకు ఉయ్యాల జంపాల సినిమాతో  హీరోయిన్ గా తన క్రేజ్ మరింత పెంచుకుంది. ఇక ఆ తరువాత హిట్స్ ప్లాప్స్ అని తేడా లేకుండా సినిమాలు చేసిన అవికా వీలైనంత వరకు తనకు నచ్చిన పాత్రలే చేస్తూ వచ్చింది. 

అయితే ఇన్నాళ్లు సీరియల్స్ సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఆమె ప్రొడక్షన్ హౌజ్ లో పెట్టుబడిగా పెట్టబోతోందని సమాచారం. నెపోలియన్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమను తెరకెక్కించిన నిర్మాత భోగేంద్ర గుప్తా మడుపల్లి ప్రస్తుతం ఆచార్య క్రియేషన్స్ పై మరో సినిమాను నిర్మిస్తుండగా అవికా గోర్ కూడా ఆ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అయ్యిందట. ఆమె కొత్తగా అవికా స్క్రీన్ క్రియేషన్స్’ బ్యానర్ ను కూడా స్థాపించినట్లు తెలుస్తోంది. ఇక మురళీ నాగ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాలో సాయి రోవర్, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి అవికా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో లాభాలను అందుకుంటుందో చూడాలి.Post a Comment

Previous Post Next Post