Subscribe Us

Balakrishna Title for Pawan Kalyan Movie??


ఒక సినిమా టైటిల్ కోసం ఇండస్ట్రీలో జరిగే చర్చలు అన్ని ఇన్ని కావు. రిజిస్ట్రేషన్ చేసే వరకు కూడా టైటిల్ ఫిక్స్ అని చెప్పలేము. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోసం సెట్టయిన ఒక టైటిల్ పై కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ కోసం ఇటీవల హరహర మహాదేవ అనే ఒక టైటిల్ ను అనుకున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే.

అసలు మ్యాటర్ లోకి వస్తే ఆ సినిమా టైటిల్ ఇంతకుముందు బాలకృష్ణ సినిమా కోసం అనుకున్నారట. గత కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ, బి.గోపాల్ దర్శకత్వంలో ఒక సినిమా సెట్టవ్వగా నిర్మాత సురేష్ బాబుతో గొడవలు అవ్వడంతో ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఆ సినిమాకు హరహర మహాదేవ అనే టైటిల్ ను అనుకున్నారు. అయితే రీసెంట్ దర్శకుడు క్రిష్ సినిమా కథకు కరెక్ట్ గా సెట్టవుతుందని ఆ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అవసరం అయితే కొంత చేంజ్ చేసి హరహర మహా అనే లైన్ వచ్చేలా ఫిక్స్ చేయనున్నారట. చూడాలి మరి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో..


Post a Comment

0 Comments