Subscribe Us

Naga Chaitanya in Another Interesting Project!!


అక్కినేని నాగ చైతన్య మజిలీ సినిమా నుంచి అస్సలు తగ్గట్లేదు.   కరోనా లేకపోయి ఉంటే ఈపాటికే రెండు సినిమాలను రిలీజ్ చేసి మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టేవాడు. ఇక నెక్స్ట్  రాబోయే సినిమాలు కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయట. ముఖ్యంగా పొలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఇంట్రెస్టింగ్ కథతో రెడీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. 

ఇక దర్శకుడు మరెవరో కాదు. పెళ్లి చూపులు ఈ నగరానికి ఏమైంది సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న తరుణ్ భాస్కర్. ఈ దర్శకుడితో సినిమా చేయాలని చైతన్య ఎప్పటి నుంచో చర్చలు జరుపుతున్నాడు. నెక్స్ట్ కమిట్మెంట్ వెంకటేష్ తో ఉంది కాబట్టి ఆ సినిమా తరువాత చైతూ తో వర్క్ చేసే అవకాశం ఉందట. ఇక నాగచైతన్య నెక్స్ట్ సినిమా లవ్ స్టొరీ ఏప్రిల్ 16న విడుదల కాబోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.


Post a Comment

0 Comments