సంక్రాంతికి మహేష్ తో పాటు ఆ ముగ్గురు!!

సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ ఫైట్ అనేది చాలా కామన్. అయితే ఈ ఫైట్ అనేది కొన్నిసార్లు ఊహించని విధంగా నష్టాలకు గురి చేస్తుంది. ఇక ఈ ఎడాది ఆల్ మోస్ట్ అన్ని హాలిడే స్పాట్ లు కూడా బుక్ అయ్యాయి. ఏ డేట్ కూడా ఖాళీగా లేదు. ఇక ఎక్కువగా అందరి చూపు 2022 సంక్రాంతిపైనే ఉంది. మహేష్ బాబు సర్కారు వారి పాట ఆ ఫెస్టివల్ సీజన్ ను బుక్ చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే అదే సీజన్ పై మరో ముగ్గురు పెద్ద హీరోలు ఫోకస్ పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ RRR తరువాత త్రివిక్రమ్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నాడు.  అదే సమయానికి ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబో లో తెరకెక్కుతున్న సలార్ కూడా సిద్ధం కానుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో రెడీ కానున్న పిరియాడిక్ సినిమా సైతం పొంగల్ భరిలోకి రావాలని చూస్తోంది. ఈ స్టార్ హీరోల మార్కెట్ విలువ వందల కోట్లల్లో ఉంటుంది. మినిమమ్ ఒక వారం గ్యాప్ ఉంటే గాని పెట్టిన పెట్టుబడులకు షేర్స్ రావు. మరి అందరూ ఒకేసారి సంక్రాంతికి వస్తే బయ్యర్లకు నష్టాలు తప్పవు. మరి మన హీరోలు ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post