బ్రహ్మానందం ఆస్తులు.. వాల్యూ ఎంతో తెలుసా?


టాలీవుడ్ ఆల్ టైమ్ బెస్ట్ కమెడియన్స్ లలో ఒకరైన బ్రహ్మానందం అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. నార్త్ లో కూడా ఓ వర్గం ఆడియెన్స్ ఆయనను ఎంతగానో ఇష్టపడతారు. బ్రహ్మానందం అనగానే అందరికి ఆయన నవ్వుల రారాజు అని అనుకుంటాం. కానీ ఆయనలో ఒక మంచి కళాత్మక ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. బొమ్మలు ఎంత బాగా వేస్తారో అందరికి తెలిసిందే.

అలాగే ఫ్యామిలీ మ్యాన్ గా కూడా బ్రహ్మానందంకు వందశాతం మార్కులు వేయాల్సిందే. పిల్లలను క్రమశిక్షణతో పెంచడమే కాకుండా భవిష్యత్తుపై ముందే ఆలోచించగల ఒక గొప్ప వ్యక్తి. ఆర్థికంగా కూడా కుటుంబ భవిష్యత్తు కోసం చక్కగా ప్లాన్ చేశారట. ఇక ఆయన సినిమాల్లో వచ్చి డబ్బును చాలా వరకు రియల్ ఎస్టేట్ లోనే ఇన్వెస్ట్ చేశారట. ఆ ఆస్తులే కొన్ని ఆయనను ఇప్పుడు వందల కోట్లకు అధిపతిని చేసింది. బ్రహ్మానందం పేరుపై హైదరాబాద్ లో ఉన్న కొన్ని ఆస్తుల వాల్యూ ప్రస్తుతం 350కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఇక వాటి విలువ రాను రాను మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.


Post a Comment

Previous Post Next Post