ఉప్పెన షూటింగ్ లాస్ట్ డే సేతుపతి అందరికి డబ్బులిచ్చారు : వైష్ణవ్


కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నాడు. ఇటీవల వచ్చిన మాస్టర్ సినిమాతోనే అతని క్రేజ్ అర్ధమయ్యింది. ఇక ఉప్పెన సినిమాలో డైరెక్ట్ గా తెలుగు విలన్ గా నట విశ్వరూపం చూపించబోతున్నట్లు అర్ధమవుతోంది. అయితే సేతుపతి గొప్పతనంపై ఒక్క మాటలోనే క్లారిటీ ఇచ్చేశాడు వైష్ణవ్ తేజ్.

ఉప్పెన షూటింగ్ ఆఖరి రోజు విజయ్ సేతుపతి డైరెక్టర్ నుంచి లైట్ సెట్ చేసే బాయ్ వరకు అందరిని ప్రత్యేకంగా పలకరించి స్పెషల్ గా డిన్నర్ ఇచ్చారట. సినిమాకు పని చేసిన స్టాఫ్ అందరికి వెయ్యి రూపాయలు ఇచ్చినట్లు వైష్ణవ్ తేజ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూస్తుంటే సేతుపతి భవిష్యత్తులో ఇక్కడ కూడా స్టార్ట్ హీరోల లెవెల్లో క్రేజ్ అందుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది.Post a Comment

Previous Post Next Post