క్రాక్ రెమ్యునరేషన్ గొడవ.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!!


2021 సంక్రాంతి సమయంలో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది క్రాక్. ఈ సినిమా ఎన్నో సమస్యలను ఎదుర్కొని మరి థియేటర్స్ వరకు వచ్చింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్ కు సినిమా సంతోషాన్ని ఇచ్చింది. అయితే ఈ స్థాయిలో విజయాన్ని అందుకున్నప్పటికి దర్శకుడు రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వలేదని పిర్యాదు చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.

దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్టర్స్ అసోసియేషన్ ను ప్రత్యేకంగా కలుసుకొని నిర్మాత మధు ఇంకా 12లక్షలకు పైగా భాకి ఉన్నట్లు చెప్పాడు. ఇక నిర్మతల మండలి కూడా ఈ విషయంపై ప్రత్యేకంగా కమిటీ వేసి చర్చలు జరువుతోంది. ఈ సమస్యపై స్పందించిన క్రాక్ నిర్మాత ఠాగూర్ మధు మాట్లాడుతూ “మిస్ కమ్యూనికేషన్" జరిగిందని ఆ కారణంగా ఈ సమస్య బయటకు వచ్చిందని అన్నారు. కోవిడ్ టైమ్ లో చాలా కష్టంతో క్రాక్‌ను నిర్మించినట్లు చెబుతూ.. సినిమా ఆలస్యం కావడం వల్ల  బడ్జెట్ అమితంగా పెరిగిందని కూడా అన్నారు.  త్వరలో నియమించిన కమిటీతో మాట్లాడతానని చెప్పిన మధు సమస్యను పరిష్కరించడానికి కమిటీతో సహకరిస్తానని అన్నారు. అలాగే  తగిన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలను వివరిస్తానని కూడా చెప్పారు.Post a Comment

Previous Post Next Post