Boxoffice Clash: Balakrishna vs Raviteja!!


బాక్సాఫీస్ ఫైట్ కు ఎవరైనా సరే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని సినీ పండితులు నిత్యం హెచ్చరిస్తూనే ఉంటారు. ఇక చాలా రోజుల చాలా రోజుల తరువాత వరుసగా సినిమాల రిలీజ్ డేట్స్ తో కొన్ని సినిమాలు క్లాష్ అవ్వక తప్పడం లేదు. అయితే మరికొందరు చర్చలతో సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. మొన్న నాని టక్ జగదీష్ సినిమాను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు రవితేజ కూడా బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు పోటీగా నిలవకుండా తన ఖిలాడి సినిమాను వాయిదా వేస్తున్నాడు. రెండు సినిమాలు మే 28న రావడానికి డిసైడ్ అయిన విషయం తెలిసిందే. అయితే గతంలో మూడు సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగగా బాలకృష్ణ సినిమాలు దారుణమైన రిజల్ట్ ను అందుకున్నాయి. ఇక ఫైనల్ గా ఈసారి మాస్ రాజానే వెనుకడుగు వేసినట్లు టాక్ వస్తోంది. ఒక 10రోజుల గ్యాప్ ఉండేలా ఖిలాడి సినిమాను వాయిదా వేసినట్లు టాక్.



Post a Comment

Previous Post Next Post