హ్యాపీడేస్ టైసన్.. సిక్స్ ప్యాక్ లుక్.. వర్కౌట్ అవుతుందో చూడాలి!


హ్యాపీ డేస్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన టాలెంటెడ్ నటీనటులలో రాహుల్ హరిదాసు ఒకరు. అర్జున్ టైసన్ పాత్రలో అతను నటించిన విధానం ఆడియెన్స్ ఎప్పటికి మర్చిపోలేరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హ్యాపీడేస్ యాక్టర్స్ దాదాపు అందరు ఆ సినిమాతో మంచి క్రేజ్ అయితే అందుకున్నారు.

అయితే ఇప్పటివరకు కొంతమందే ఇండస్ట్రీలో ఒక స్థాయిలో ఉన్నారు. ఇక రాహుల్ అయితే ఆ సినిమా తరువాత మళ్ళీ ఏ సినిమాతో కూడా క్లిక్కవ్వలేదు. చివరగా 2017లో వెంకటాపురం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాహుల్ మళ్ళీ ఇన్నాళ్లకు 100కోట్లు.. అనే సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమా కోసం రాహుల్ ఇలా సిక్స్ ప్యాక్ తో రెడీ అయ్యాడు. ఫుల్ యాక్షన్ డ్రామాగా ఆ సినిమాను రూపొందిస్తున్నారట. ఇక ఈ సినిమాతో రాహుల్ నటుడిగా తానేంటో నిరూపించుకోవాలని చూస్తున్నాడు. మరి సినిమా ఏ స్థాయిలో వర్కౌట్ అవుతుందో చూడాలి.Post a Comment

Previous Post Next Post