టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా బడ్జెట్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. శంకర్ లాంటి దర్శకుడు బడ్జెట్ హద్దులు లేకుండా సినిమాను తెరకెక్కిస్తాడని అందరికి తెలిసిన విషయమే. అలాంటి దర్శకుడితో తెలుగు నిర్మాత దిల్ రాజు ఎలా మ్యానేజ్ చేయగలడనేది హాట్ టాపిక్ గా మారింది.
ఇంతవరకు దిల్ రాజు కెరీర్ లో 100కోట్ల బడ్జెట్ సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు శంకర్ - రామ్ చరణ్ అందులోను పాన్ ఇండియా కాబట్టి బడ్జెట్ ఈజీగా 150కోట్లు అవుతుంది. అయితే దిల్ రాజు ఆ నెంబర్ ను దృష్టిలో ఉంచుకొని ప్లాన్ రెడీ చేస్తున్నాడట. శంకర్ కు ముందే బడ్జెట్ లిమిట్ దాటకుండా ఒక కండిషన్ అయితే పెట్టాడట. అంతకంటే ఒక్క రూపాయి ఎక్కువైనా కష్టమే అని ముందే చెప్పినట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment