పూరి 'రొమాంటిక్' కొడుకు ఎక్కడ?


డేరింగ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రతేకమైన గుర్తింపు అందుకున్న పూరి జగన్నాద్ తన 20 ఏళ్ల కెరీర్ లో దాదాపు స్టార్ హీరోలందరితో వర్క్ చేశాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ కూడా అనుకున్నాడు, అయితే తన కొడుకు ఆకాష్ కోసం మాత్రం సరైన హిట్ ఇవ్వలేకపోయాడు. మెహబూబా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే, అయితే తన శిష్యుడి మీద నమ్మకంతో స్టోరీ అందించి మరి సొంత ప్రొడక్షన్ లో ఒక సినిమాను స్టార్ట్ చేశాడు. 

రొమాంటిక్ అనే ఆ సినిమా గత ఏడాది సమ్మర్ లోనే రావాల్సింది. కానీ అప్పుడే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడింది. అయితే సినిమా థియేటర్స్ ఓపెన్ అయినా కూడా ఇంకా ఆ సినిమాను వెలుగులోకి తీసుకురాలేదు. సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండానే మరో సినిమాను సెట్స్ పైకి తెచ్చారు. జార్జిరెడ్డి దర్శకుడితో ఆకాష్ ఈ రోజు చోర్ బజార్ అనే సినిమాను లాంచ్ చేశాడు. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.Post a Comment

Previous Post Next Post