Chay out of Akkineni Multi-starrer??


అక్కినేని ఫ్యామిలీలో అందరి కంటే జోరుగా బిజీగా కనిపిస్తున్న హీరో నాగ చైతన్య అనే చెప్పాలి. సినిమా సినిమాకు అతనికున్న క్రేజ్ గట్టిగానే పెరుగుతోంది. ముఖ్యంగా మజిలీ సినిమా నుంచి నాగ చైతన్య ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా మార్కెట్ కూడా గట్టిగానే పెరుగుతోంది. ఇక నెక్స్ట్ లవ్ స్టొరీ సినిమాతో మరింత పెద్ద మార్కెట్ సెట్ చేసుకునేలా ఉన్నాడని అర్ధమవుతోంది.

అయితే అక్కినేని మల్టీస్టారర్ సినిమాలో నాగ చైతన్య నటించకపోవచ్చని తెలుస్తోంది. ఆ మల్టీస్టారర్ సినిమా మరేదో కాదు. నాగార్జున ఎంతో ఇష్టపడి చేస్తున్న సోగ్గాడే చిన్న నాయనా సిల్వెల్ బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తయ్యింది. అయితే ఒక ఇంపార్టెంట్ పాత్ర కోసం చైతూను అనుకోగా అతను ప్రస్తుతం బిజీగా ఉండడం వల్ల డ్రాప్ అయ్యాడట. ఇక సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని నాగ్ వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. మరో హీరోను సంప్రదించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.



Post a Comment

Previous Post Next Post