If Uppena was made with Vijay Deverakonda??


గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో ఉప్పెన సినిమాపై వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక మొత్తానికి సినిమా శుక్రవారం గ్రాండ్ గా విడుదలయ్యింది. అయితే సినిమా నిజంగా అనుకున్నంత రేంజ్ లో హిట్ అయ్యిందా లేదా అనే విషయంపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఇక ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు వరుస ఇంటర్వ్యూలతో నిన్నటివరకు ప్రమోషన్ గట్టిగానే చేశాడు.

అయితే ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కాకుండా ఇంకా ఎవరైనా హీరోలను అనుకున్నారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఒకనొక సమయంలో విజయ్ దేవరకొండ అలా మైండ్ లో కదిలినట్లు చెప్పాడు. కానీ ప్రస్తుతం విజయ్ స్థాయికి ఈ కథ సెట్టవ్వదని అందుకే కొత్త హీరోతో చేస్తేనే బావుంటుందని వైష్ణవ్ తేజ్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు చెప్పాడు. వైష్ణవ్ ఈ సినిమాకు పూర్తిగా న్యాయం చేసినట్లు చెప్పిన బుచ్చిబాబు అతను భవిష్యత్తు మంచి స్టార్ హీరో అవుతాడని వివరణ ఇచ్చాడు.



Post a Comment

Previous Post Next Post