Another Hero in Ramcharan-Shankar Mega Project??
Friday, February 12, 2021
0
మొత్తానికి అనుకున్నట్లే రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ సెట్టయ్యింది. మొదటి సారి దర్శకుడు శంకర్ తెలుగు హీరోతో వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక డిఫరేంట్ యాక్షన్ సినిమాగా శంకర్ ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఇక మొత్తానికి దిల్ రాజు కూడా శంకర్ తో చేయాలన్న డ్రీమ్ ను నెరవేర్చుకుంటున్నాడు. అయితే ఆ సినిమాలో మరొక హీరో నటించే ఛాన్స్ ఉన్నట్లు గతంలో రూమర్స్ వచ్చాయి. కుదిరితే KGF స్టార్ యష్ ను తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు చాలా కథనాలు వచ్చాయి. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు మరో ముఖ్యమైన హీరో ఎవరో ఉండే ఉంటారని గాసిప్ వైరల్ గా మారింది. తెలుగు తమిళ్ హిందీ లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తారు కావున ఇద్దరు హీరోలు ప్లస్ పాయింట్. మరి ఆ రూమర్ కూడా నిజమవుతుందో లేదో చూడాలి.
Follow @TBO_Updates
Tags