టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కాలం తరువాత బాక్సాఫీస్ కు గ్యాప్ ఇస్తున్నాడు. అప్పుడెప్పుడో ఖలేజా వల్ల వచ్చిన గ్యాప్ ను మళ్ళీ ఎన్నడూ రిపీట్ చేయని మహేష్ మళ్ళీ ఇన్నాళ్లకు కరోనా లాక్ డౌన్ వల్ల తప్పలేదు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు అనంతరం మరో సంక్రాంతికి రావాలని అనుకున్నప్పటికి వర్కౌట్ కాలేదు. ఇక ఫైనల్ గా వచ్చే సంక్రాంతికి సర్కారు వారి పాటతో సరికొత్తగా అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
టైమ్ చాలానే ఉంది కాబట్టి మొదట ఈ సినిమాను మెల్లగానే ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ మహేష్ రాజమౌళి సినిమా కంటే ముందే మరో సినిమా చేయాలి అంటే SVPను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలి. వచ్చే దసరా లోపు పూర్తి చేయాలని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నాడట. ఇక మరో చోటా కమర్షియల్ సినిమా కోసం అనిల్ రావిపూడితోనే చర్చలు జరుపుతున్నట్లు టాక్. అంతే కాకుండా వెంకీ కుడుములతో కూడా డిస్కషన్స్ జరుగుతున్నట్లు సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment