గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పటికే సినిమా 70కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమా అనంతరం దర్శకుడు బుచ్చిబాబు ఎలాంటి సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.
సుకుమార్ కు తగ్గ శిష్యుడిగా మంచి క్రేజ్ అందుకున్న బుచ్చిబాబు వీలైనంత త్వరగా మరొక సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ అయితే ఇప్పట్లో అతన్ని వదిలేలా లేదు. రెండు సినిమాలకు కమిట్మెంట్ తీసుకున్నారు. ఇక నాగార్జున ఉప్పెన దర్శకుడిపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అఖిల్ కోసం కథ రెడీ చేయమని సూచనలు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డితో ఒక యాక్షన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత బుచ్చిబాబుతో సినిమా ఉండవచ్చని టాక్. మరి ఉప్పెన దర్శకుడు అఖిల్ బాబుకు ఎలాంటి స్టోరీ సెట్ చేస్తాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment