డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న నాని !!


న్యాచురల్ స్టార్ నాని కూడా వరుసగా సినిమాలను లైన్ లో పెట్టాడు. మరో రెండేళ్ల వరకు బిజీగా ఉండేలా ప్లాన్ రెడీ చేసుకున్న నాని వీలైనంత వరకు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ఆకట్టుకోవాలని అనుకుంటున్నాడు. గత ఏడాది కాస్త కొత్తగా ట్రై చేసిన V డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ టక్ జగదీష్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. 

అయితే ఈ నెల 24న నాని పుట్టినరోజు కావడంతో సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ బ్యాక్ టూ బ్యాక్ అభిమానులకు కిక్కివ్వనున్నట్లు సమాచారం. ముందుగా టక్ జగదీష్ కు సంబంధించిన టీజర్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఆ తరువాత శ్యామ్ సింగరాయ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రావచ్చని సమాచారం. ఈ రెండు సినిమాలతో పాటు వివేక్ ఆత్రేయతో 'అంటే సుందరానికి..' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా రావచ్చని సమాచారం. ముఖ్యంగా టక్ జగదీష్ టీజర్ ను తప్పకుండా రిలీజ్ చేయాలని నాని టీమ్ ఫిక్స్ అయ్యింది.Post a Comment

Previous Post Next Post