టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తయ్యింది. ఇక అయ్యప్పనుమ్. కొశీయుమ్ సినిమాకు సంబంధించిన ఒక కీలక షెడ్యుల్ కూడా పూర్తయ్యింది. మరోవైపు క్రిష్ సినిమాతో కూడా బిజీ అయ్యాడు పవర్ స్టార్.
ఇక హరీష్ శంకర్, సురేంధర్ రెడ్డి వంటి మాస్ కమర్షియల్ దర్శకులతో కూడా సినిమాలు చేయనున్న పవన్ బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ తో కూడా ఒక కథపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రాజమౌళి సినిమాలకు కథలు అందించే విజయేంద్రప్రసాద్ అప్పుడప్పుడు బయట హీరోలకు కూడా స్టోరీలు రాస్తుంటారు. పవన్ కోసం కూడా పవర్ఫుల్ స్టోరీ సెట్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment