ఇండియన్ నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్న డార్లింగ్ త్వరలోనే మరో బిగ్ ప్రొడక్షన్ హౌజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సంస్థ మరేదో కాదు. 50 ఏళ్ళ చరిత్ర ఉన్న యష్ రాజ్ ఫిలిమ్స్.
యాష్ రాజ్ ఫిలిమ్స్ చాలా కాలంగా ప్రభాస్ తో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తోంది. మొదట ధూమ్ 4లో అనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు. ఇక ప్రభాస్ ను వేరే కథతో ఎలాగైనా ఒప్పించాలని త్వరలోనే స్టోరీ వినిపించనున్నారట. మనీష్ శర్మ అనే దర్శకుడు ప్రభాస్ కు కథ వినిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. మరి యష్ రాజ్ ఫిలీమ్స్ తో సినిమా ఒకే చేస్తే ఎప్పుడు సెట్స్ పైకి తెస్తాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment