Shocking Rumor @ NTR to act in Hollywood Movie!!


ఇండియా మొత్తంలో టాప్ టాలెంటెడ్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నెక్స్ట్ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా తన స్థాయిని మరింత పెంచుకోబోతున్న ఎన్టీఆర్ ఆ తరువాత హాలీవుడ్ లో కూడా అడుగులు వేసే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇంతవరకు ఇండియాలో ఏ హీరో కనిపించని విధంగా ఎన్టీఆర్ ఇంగ్లీష్ తెరపై కనిపిస్తాడని రూమర్స్ వస్తున్నాయి. 

ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని భారతీయ మూలాలున్న హాలీవుడ్ దర్శకుడు మనోజ్ నైట్ శ్యామలన్ త్వరలో ఒక ఇండియన్ స్టార్ తో ఇంగ్లీష్ మూవీ తీయాలని అనుకుంటున్నాడట.  ది సిక్స్త్ సెన్స్, అన్‌బ్రేకబుల్, సైన్స్, స్ప్లిట్ లాంటి చిత్రాలతో హాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకున్న మనోజ్ ఎన్టీఆర్ పై కూడా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. చివరగా గ్లాస్ అనే సినిమా తీసిన ఈ దర్శకుడు నెక్స్ట్ ఎలాగైనా మరో బిగ్ బడ్జెట్ సినిమాలో ఎన్టీఆర్ ని ఒక ముఖ్యమైన పాత్ర కోసం సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు టాక్.